Fri Dec 20 2024 11:55:00 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టులో మూడు గేట్ల ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు చేరుతుంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు కొద్దిసేపటి క్రితం మూడు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. పది అడుగుల మేరకు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 878.40 అడుగుల వరకూ ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 179.89 టీఎంసీలుగా ఉందన్నారు.
నాగార్జునసాగర్ కు...
వరద నీరు ఎక్కువగా వస్తుండటంతో ప్రస్తుతానికి మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఈ మూడు గేట్ల ద్వారా 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. గేట్లు ఎత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టుకు సంబంధించి నేడు 6,7,8 గేట్లను ఎత్తారు.
Next Story